![]() |
![]() |

టాలీవుడ్ ఇండస్ట్రీలో "బావ" మూవీతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రణీత అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది"లో ఎంతో క్యూట్ గా కనిపించి మెప్పించింది. ఇక ఈ మూవీ తర్వాత ప్రణీతను ఆడియన్స్ బాపుబొమ్మ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అలాంటి ప్రణీత ఇప్పుడు ఢీ సెలబ్రిటీ స్పెషల్ డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఆమె నెటిజన్స్ తో చాట్ చేసింది. "ప్రణీత ఫౌండేషన్ గురించి కొంచెం చెప్పండి.." అని ఒక నెటిజన్ అడిగేసరికి "ఏదైనా క్రైసిస్ టైములో మేము ప్రజలకు సహాయం చేయడానికి ముందుంటాం. మాలాంటి ఆలోచనలు ఉండి ముందుకెళ్లాలి అనుకునే వాళ్ళతో మేము కొలాబరేట్ కావడానికి చూస్తున్నాం" అని చెప్పింది. "మీ ఆయన ఎప్పుడైనా వంట చేస్తారా ?" " అయ్యయో లేదండి. ఆయన అంత బాగా వంట చేయలేరు అందుకే మేము ఆర్డర్ చేసి తెప్పించుకుంటాం" అని చెప్పింది.

"ఢీ షో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తోంది మీకు" "చాలా ఫన్ గా ఉంది. నందు, శేఖర్ మాష్టర్, ఆది అన్న, ఇంకా కంటెస్టెంట్స్ అందరితో మంచి ఫన్ గా ఉంది" అని చెప్పింది. ఇకపోతే ప్రణీత కరోనా టైంలో ఎంతో మందికి ఫుడ్ డొనేట్ చేసింది తన ఫౌండేషన్ ద్వారా. పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయిన ప్రణీత ఒక పాప పుట్టాక మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అప్పుడప్పుడు గ్లామర్ పిక్స్ అవీ షేర్ చేస్తూ ఉంటుంది. తన లేటెస్ట్ అప్ డేట్స్ ని ఫోటో షూట్స్ ని తన వెకేషన్స్ ని తన పాపతో గడిపిన మూమెంట్స్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేస్తూ ఉంటుంది ప్రణీత.
![]() |
![]() |